హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఎలక్ట్రికల్ షాపులో ఆదివారం నాడు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఆరు గంటల నుండి అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఎలక్ట్రికల్ షాపులో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ షాపునకు పక్కనే ఉన్న ఇతర దుకాణాలను అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.

మంటల తీవ్రతకు భవనం పూర్తిగా దెబ్బతింది.దీంతో భవనం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ భవనానికి సమీపంలో ఉన్న ఇతర దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు.

also read:ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి

మంటలు వ్యాపించిన భవనానికి కిందనే ఓ సంస్థకు చెందిన బంగారు ఆభరణాల దుకాణం, ప్రముఖ వస్త్ర దుకాణం ఉంది. ఈ మంటలు కిందనే ఉన్న వస్త్ర దుకాణానికి వ్యాప్తిస్తే మరింత ప్రమాదమని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయంతో ఉన్నారు. దీంతో అగ్నిప్రమాదం జరిగిన భవనానికి పక్కనే ఉన్న ఇతర దుకాణాలను కూడ ఖాళీ చేయిస్తున్నారు.

నాలుగు అంతస్తుల భవనంలో ఎలక్ట్రికల్ షాపు ఉంది. ఈ భవనానికి ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోలేదు. భవనానికి మూడు వైపుల నుండి అగ్నిమాపక సిభ్బంది ఈ భవనంలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.