కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పది మంది కరోనా రోగులు మరణించారు. ఈ ఘటన రోమనియా దేశంలో శనివారంనాడు చోటు చేసుకొంది.కరోనా రోగులకు ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రం నుండి  మంటలు వ్యాపించినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ఐసీయూ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది  రోగులను బయటకు తీసుకొచ్చారు.  రోగులను బయటకు తీసుకువస్తున్న సమయంలో మంటలు వ్యాపించడంతో ఐసీయూలో ఉన్న 10 మంది కరోనా రోగులు మరణించారు.

మంటలధాటికి ఏడుగురు కరోనా రోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కరోనా రోగులను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.రోమనియా దేశంలోని పియాట్రా నీమ్డ్ లోని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.

అగ్ని ప్రమాదంలో మరణించినవారిలో ఒకరు మినహా అందరూ కూడ రోగులేనని ప్రభుత్వం ప్రకటించింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని  రోమనియా వైద్యశాఖ మంత్రి నేలు టాటరు తెలిపారు.