నాగర్ కర్నూల్ ఏదుల రిజర్వాయర్ వద్ద అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

నాగర్ కర్నూల్  జిల్లా కోడేరు మండలం ఏదుల జలాశయం వద్ద ఇవాళ అగ్ని ప్రమాదం చోటు  చేసుకుంది.  

Fire Breaks out  At  Yedula Reservoir in Nagarkurnool district lns

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్  జిల్లా కోడేరు మండలం ఏదుల జలాశయం వద్ద   గురువారంనాడు  అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది.  షార్ట్ సర్క్యూట్  కారణంగా  మంటలు  వ్యాపించాయి.  దీంతో  అక్కడే  ఉన్న సిలిండర్లు  పేలాయి.  దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం  ఇచ్చారు.ఈ సమాచారం  ఆధారంగా  సంఘటన స్థలానికి  ఫైరింజన్లు  చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇటీవల  కాలంలో  ఇటీవల  కాలంలో అగ్ని ప్రమాదాలు  ఎక్కువగా  చోటు  చేసుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా  ఇటీవల  కాలంలో  ఇటీవల  కాలంలో అగ్ని ప్రమాదాలు  ఎక్కువగా  చోటు  చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రకాశం జిల్లా దర్శిలో  ఈ నెల  24న  బట్టల దుకాణంలో  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  దీంతో భారీగా  పొగ కమ్మేసింది. ఈ నెల  22న గుజరాత్ రాష్ట్రంలోని  రాజ్ కోట్ లో ఫర్నీచర్ గోడౌన్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  ఫర్నీచర్ అగ్నికి కాలిబూడిదైంది. 

 తెలంగాణలోని హైద్రాబాద్ లోని మణికొండలో  ఈ నెల  20న  కిడ్స్ ప్లే  స్కూల్ లో అగ్ని ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదాన్ని గుర్తించి  వెంటనే  పిల్లలను  బయటకు పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం  జరిగింది.   గ్యాస్ లీకై  మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని స్థానికులు  ఓఎన్‌జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  ఓఎన్‌జీసీ సిబ్బంది మంటలను  అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటన  ఈ నెల  16న  జరిగింది. 

మరో వైపు  తిరుపతిలోని  గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని  ఫోటో ఫ్రేమ్  వర్క్స్ దుకాణంలో  ఈ నెల  16న అగ్ని ప్రమాదం  జరిగింది.   రెండు మూడు గంటలకు  పైగా  కష్టపడి అధికారులు  మంటలను ఆర్పివేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios