హైద్రాబాద్ కాటేదాన్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం:మంటలార్పిన ఫైరింజన్లు
హైద్రాబాద్ నగరంలోరి రాజేంద్రనగర్ కాటేదాన్ లో గల ప్లాస్టిక్ కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.
హైదరాబాద్:నగరంలోని రాజేంద్రనగర్ కాటేదాన్ లోని ప్లాస్టిక్ కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశారు. ఈ కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.