మంచిర్యాలలో జోగు రామన్నకు తప్పిన ముప్పు (వీడియో)

First Published 17, Feb 2018, 1:47 PM IST
Fire breaks out  at minister Jogu Ramannas meeting at mancherial
Highlights
  • మున్నూరు కాపు భవన శంకుస్థాపనలో అపశృతి
  • బాణసంచా పేలుడతో వేదికకు అంటుకున్న మంటలు
  • సేఫ్ గా బయటపడ్డ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు

తెలంగాణ అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ముప్పు తప్పింది. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి ప్రాంతంలో మున్నూరు కాపు భవన శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న వచ్చారు. ఆయన తో పాటు మూడు నియోజక వర్గాల శాసన సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన విఐపిలు వస్తున్న సందర్భంలో పటాకులు కాల్చారు. అయితే బాణసంచా వేదిక దగ్గర్లో పేల్చారు. ఈ సమయంలో మంటలు వ్యాపించి వేదిక కోసం ఏర్పాటు చేసిన టెంట్లపై నిప్పు రవ్వలు పడి అంటుకున్నాయి. దీంతో మంత్రి సహా అక్కడున్నవారంతా వేదిక ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తర్వాత మున్నూరు కాపు ప్రతినిధులు ఆ మంటలు ఆర్పేశారు. మంటలు అంటుకున్న వీడియో కింద చూడొచ్చు.

 

loader