హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని రాయదుర్గం షాగ్ హౌస్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
హోటల్ లోని చిమ్ని నుండి మంటలు వ్యాప్తి చెందినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. 

ఈ హోటల్ నుండి చుట్టుపక్కలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫైర్ పైటర్లు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో స్థానికులను అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం చేశారు. ఫైర్ సేఫ్టీ చర్యలు ఈ హోటల్ యాజమాన్యం తీసుకొందా లేదా అనే అంశంపై కూడ అగ్నిమాపక  సిబ్బంది దర్యాప్తు చేసే అవకాశం ఉంది.