సికింద్రాబాద్ హోటల్‌లో అగ్ని ప్రమాదం: మంటలను ఆర్పుతున్న ఫైరింజన్లు
సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో ఇవాళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని హోటల్ లో ఆదివారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ లో కిచెన్ లో మంటలు చెలరేగాయి. వంట చేసే సమయంలో మంటలు వ్యాపించినట్టుగా హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హోటల్ లో మంటలను ఫైరింజన్లు ఆర్పివేస్తున్నాయి. ఈ హోటల్ లో అగ్ని ప్రమాదం కారణంగా ఈ హోటల్ పక్కనే ఉన్న లాడ్జీలను ఖాళీ చేయించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నమోదౌతున్నాయి.
ఈ ఏడాది జూన్ 16న తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఫోటో ఫ్రేమ్ వర్స్క్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు గంటలకు పైగా అధికారులు కష్టపడి మంటలను ఆర్పివేశారు.
జూన్ 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దర్శిలోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఏడాది జూన్ 16న ఓఎన్‌జీసీ లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.
ఈ ఏడాది జూన్ 29న కోడేరు మండలం ఏదుల రిజర్వాయర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణలోని మణికొండలో జూన్ 20న కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
జూన్ 15న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిద్రపోతున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నిద్రపోతున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. పల్నాడు జిల్లాలోని పెద్దపాలెంలో జూన్ 14న అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 15 పూరిళ్లు దగ్దమయ్యాయి.