హైదరాబాద్  డబీర్ పురా అపార్ట్ మెంట్ లో   ఇవాళ  అగ్ని ప్రమాదం  జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో  రూ.  5లక్షల ఆస్తినస్టం  చోటు  చేసుకుంది.  

హైదరాబాద్: నగరంలోని డబీర్‌పురా అపార్ట్‌మెంట్ లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుందని అధికారులు గుర్తించారు. 

డబీర్‌పురా అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం పంపారు. వెంటనే సంఘటన స్థలానికి ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు.