తెలంగాణ హైకోర్టులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయస్థానం పరిపాలనా భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిని గమనించిన హైకోర్టు భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.