Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్‌ : స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది, సాయం కోసం ఆర్తనాదాల

సికింద్రాబాద్‌ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బట్టల దుకాణం, గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే కాంప్లెక్స్ లోపల ఎనిమిది మంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 

fire accident in swapnalok complex in secunderabad
Author
First Published Mar 16, 2023, 8:08 PM IST

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని 7, 8 అంతస్తులకు వ్యాపించాయి. బట్టల దుకాణం, గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో ఫైర్ సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే కాంప్లెక్స్ లోపల ఎనిమిది మంది వ్యక్తులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సెల్‌ఫోన్ టార్చ్‌లు వేస్తూ సాయం కోసం అరుస్తున్నారు బాధితులు. ఇంకా కొంతమంది వర్కర్స్ లోపల వున్నట్లుగా యాజమాన్యం చెబుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios