హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలోని పాతబస్తీ ఆజంపురాలో వున్న ఓ టైర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ కాసేపటికే సికింద్రాబాద్ పద్మజా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది

సికింద్రాబాద్ పద్మజా హోటల్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. హోటల్‌లో పలువురు వుండటంతో వారిని సిబ్బంది బయటకు పంపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also REad: హైదరాబాద్ : పాతబస్తీలోని టైర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి ఫైరింజన్లు

కొద్దిసేపటి క్రితం పాతబస్తీలోనూ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆజంపురాలోని టైర్ల గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలావుండగా..గత వారం చాదర్‌ఘాట్‌లోనూ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. టైర్ల దుకాణానికి సంబంధించిన పాత గోడౌన్‌లో శనివారం మంటలు చెలరేగాయి.