ఉస్మానియా యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం

fire accident at osmania university
Highlights

విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం

ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. క్యాంపస్ పరిధిలోని పరీక్షా మూల్యాంకన విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఉదయం సమయంలో ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాన నష్టం జరగలేదు. స్పల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. 

 ఈ అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. 

ఈ  అగ్నికి పరీక్షల విభాగంలోని పేపర్ స్టోర్ గదిలో భద్రపరిచిన డిగ్రీ పరీక్షల సమాధాన పత్రాలు కాలిబూడిదయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఓయూ వీసీ రామచంద్రంతో పాటు స్థానిక ఏసీపీ, సీఐ లు పరిశీలించారు. ఈ ప్రమాదం, ఆస్తి నష్టం పై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
 

loader