భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌‌లో 11 మంది మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

First Published 4, Jul 2018, 12:26 PM IST
Fire accident at Bhadadri fire works in Warangal
Highlights

భద్రకాళీ ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం: 11 మంది సజీవ దహనం

వరంగల్: వరంగల్ భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ  ఘటనలో  11 మంది సజీవ దహనమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.. ఈ ఘటనలో సుమారు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వరంగల్  పట్టణంలోని భద్రకాళీ  ఫైర్‌ వర్క్‌లో బుధవారం నాడు అగ్ని ప్రమాదం  చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో  11 మంది సజీవదహనమయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే  అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.

భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో ఉన్న బాణసంచా అగ్నికి ఆహుతైంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో ఉన్న బాణసంచా అగ్నికి ఆహుతైంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

భద్రకాళీ   ఫైర్‌వర్క్స్‌లో బాణా సంచాను తయారు చేస్తున్నారు.  అయితే ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఒకరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం విన్పించింది. భద్రకాళీ ఫైర్ వర్క్స్ గోడౌన్ కుప్పకూలిపోయింది. ఇక్కడ పనిచేసే వారంతా చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహలు దెబ్బతిన్నాయి. ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి.

రెండు కిలోమీటర్ల పాటు ఈ శబ్దం విన్పించింది. విద్యుత్ తీగలు కూడ తెగిపోయాయి. ఘటన స్థలాన్ని కలెక్టర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

ప్రతి రోజూ ఎంతమంది విధులను నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఈ విషయమై ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

                                

loader