శంషాబాద్ విమానాశ్రయం... హైదరాబాద్ విమానానికి అగ్నిప్రమాదం

First Published 2, Aug 2018, 9:54 AM IST
fire accide nt in flight at samshabad airport
Highlights

ప్రమాద సమయంలో విమానంలో 149మంది ప్రయాణికులు ఉన్నారు


శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి హైదరాబాద్  వస్తున్న ఓ విమానంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు లో మరికొద్ది సేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ప్రమాదం చోటుచేసుకుంది.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. దీంతో విమానంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కువైట్‌ నుంచి వస్తున్న జెజిర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అర్ధరాత్రి 1.30 నిమిషాల సమయంలో నగరానికి చేరుకుంది. 

రన్‌ వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం ఇంజిన్‌ నుంచి మంటలు రావడంతో పైలట్ దాన్ని సకాలంలో నిలిపివేశాడు. విమానంలో ఉన్న 149 ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా కిందకు దించివేశారు. 

ఓ వైపు మంటలను అదుపు చేస్తుండగా మరో వైపు ప్రయాణికులు కిందకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది రన్‌ వేపై ఉన్న విమానం వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

loader