Asianet News TeluguAsianet News Telugu

పగబట్టిన మృత్యువు... గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తల్లీ, కూతురు మృతి, తండ్రి, కొడుకు పరిస్థితి విషమం..

మళ్లీ దోమడుగు పరిధికి రాగానే ఓ మలుపు దగ్గర ద్విచక్రవాహం రెండోసారి అదుపుతప్పి Dividerను ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా... మధ్యలో కల్పన, కృతిక శివాని మృతి చెందారు. బ్రహ్మచారి, అతని కొడుకు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండడంతో సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

Final Destination : Two times accident in one place, 2 dead, 2 serious in gummadidala
Author
Hyderabad, First Published Dec 13, 2021, 8:09 AM IST

గుమ్మడిదల :  హాలీవుడ్ లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.  మృత్యువు రాసిపెట్టి ఉంటే రాసిపెట్టి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేం. దాన్ని ఎలా తప్పించుకోవాలని ప్రయత్నించినా... ఒక రూపంలో కాక పోతే మరో రూపంలో దరి చేరుతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ప్రాణాలు పట్టుకెడుతుంది. విధి తలుచుకుంటే ఎలా జరుగుతుందో.. ఊహించి తీసిన సినిమా అది. అయితే అలాంటి ఘటనే అచ్చంగా నిజ జీవితంలో జరిగింది. 

Sangareddy District గుమ్మడిదలలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ కుటుంబాన్ని గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు కాటేశాయి.  తొలి ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డా,  రెండోసారి జరిగిన Accident తల్లి కుమార్తెలను బలితీసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పరిధిలో ఆదివారం ఈ ప్రమాదాలు జరిగాయి. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…

యాదాద్రి : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎగిసిపడ్డ రసాయనాలు

గుమ్మడిదలకు చెందిన  కమ్మరి బ్రహ్మచారి (32),  ఆయన భార్య కల్పన (25), కుమార్తె  కృతిక శివాని (4), కుమారుడు కార్తీక్ (2)లు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు two wheelerపై హైదరాబాద్ శివారులోని బొల్లారంలో శుభకార్యానికి బయలుదేరారు. దోమడుగులో వీరి వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలు కావడంతో తేరుకుని సమీపంలోని అన్నారం ప్రాథమిక ఆస్పత్రిలో First aid చేయించుకున్నారు.

శుభకార్యానికి వెళ్ళకుండా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ దోమడుగు పరిధికి రాగానే ఓ మలుపు దగ్గర ద్విచక్రవాహం రెండోసారి అదుపుతప్పి Dividerను ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా... మధ్యలో కల్పన, కృతిక శివాని మృతి చెందారు. బ్రహ్మచారి, అతని కొడుకు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండడంతో సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఎమ్మెల్యేని.. నాకే సలామ్ పెట్టవా: అర్థరాత్రి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ దౌర్జన్యం

ఇదిలా ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కకడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును అతి వేగంగా నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

మృతులను ఏలూరు, విజయవాడ వాసులుగా గుర్తించారు. మృతుల్లో చరణ్‌ది విజయవాడ కాగా.. సంజూ, గణేశ్‌లది ఏలూరు అని తెలిపారు. గాయపడిన అశోక్ అనే యువ‌కుడిని  సూరారంలోని ఓ ఆసుపత్రిలో త‌ర‌లించారు. ప్రమాదం జరిగిన సమయంలో చరణ్‌ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios