Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి థర్డ్‌ఫ్రంట్‌.. కేసీఆర్‌‌‌కు కమ్యూనిస్టులు దగ్గరవుతున్నారా, విజయన్‌ భేటీ ఎందుకు..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో (kcr) కేరళ సీఎం పినరయి విజయన్‌ (pinarayi vijayan) సహా సీపీఎం (cpm) నేతల భేటీ హాట్ టాపిక్‌గా మారింది. కేరళ సీఎం తన ఇద్దరు మంత్రివర్గ సహచరులతో పాటు సీపీఎం జాతీయ  ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ (sitharam yechury) , ప్రకాశ్ కారత్‌లతో (prakash karat) కలిసి భేటీ అయ్యారు.

Federal front Telangana CM KCR meet Kerala counterpart Pinarayi Vijayan
Author
Hyderabad, First Published Jan 8, 2022, 6:30 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో (kcr) కేరళ సీఎం పినరయి విజయన్‌ (pinarayi vijayan) సహా సీపీఎం (cpm) నేతల భేటీ హాట్ టాపిక్‌గా మారింది. కేరళ సీఎం తన ఇద్దరు మంత్రివర్గ సహచరులతో పాటు సీపీఎం జాతీయ  ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ (sitharam yechury) , ప్రకాశ్ కారత్‌లతో (prakash karat) కలిసి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. అయితే రెండు రోజులుగా రాష్ట్ర పారిశ్రామిక వేత్తలతో కేరళ సీఎం భేటీ అయ్యారు. పెట్టుబడుల అంశంపై కేసీఆర్‌తో సమావేశమైనట్లు సమాచారం. 

ఇంత వరకు బాగానే వుంది కానీ..  సీఎం కేసీఆర్‌తో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కారత్ కూడా వుండటంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని , రాజకీయ సమీకరణాలు కూడా చేయాలని చర్చ జరిగిన నేపథ్యంలో కేసీఆర్‌ను కలవడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కేసీఆర్‌తో కలిసి పనిచేయాలా..? సీపీఎంతో కలిసి పనిచేయడానికి కేసీఆర్ సిద్ధంగా వున్నారా.. ?ఇలాంటి అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్ తో పాటు…పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చించడం జరుగుతుందని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని..దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలు తెలపవచ్చన్నారు ఏచూరి తెలిపారు. వీటికి సవరణల అనంతరం జాతీయ స్థాయిలో జరిగే మహాసభలో రాజకీయ నివేదిక ప్రవేశపెడుతామని సీతారాం ఏచూరి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios