తనకు ఎన్ని లీగల్ నోటీసులు ఇచ్చినా భయపడబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చిచెప్పారు. తాను ప్రజా సమస్యలపై పోరాడి ఎన్నో సార్లు జైలుకు వెళ్లానని, తనకు జైలు అంటే కొత్తదేమీ కాదని చెప్పారు. గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు సంబంధం లేకపోతే సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను ప్రజల తరుఫు మాట్లాడుతున్నానని చెప్పారు. కాబట్టి ఎవరికీ బయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాను వాస్తవాలే మాట్లాడుతున్నానని అన్నారు. తెలంగాణ ఐటీ, మన్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రేపు తెలంగాణకు అమిత్ షా : ఈ ప్రశ్నలకు బదులేది, కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ బహిరంగ లేఖ
లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు. ‘‘ నీకు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో ఎలాంటి సంబంధమూ లేకపోతే.. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని అనుకుంటే.. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయు ’’ అని సవాల్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర 30వ రోజు పాదయాత్ర శుక్రవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం కు చేరుకుంది. ఈ సందర్భంగా హెచ్ఎండీ పార్క్ సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్ పై పరువు నష్టం దావా: లీగల్ నోటీసు పంపిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు.
ఆ పాపం ఊరికే పోదని అన్నారు. పేద విద్యార్థులు చనిపోతే సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేయడానికి వెళ్తే లాఠీఛార్జ్ చేయించారని తెలిపారు. తాను ఎవరికీ భయపడబోనని అన్నారు. తనపై ఐక్య రాజ్య సమితిలో నోటీసులు ఇచ్చినా పర్వాలేదని, కానీ గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలేమిటో ప్రజలకు చెప్పాలని అన్నారు.
టీఆర్ఎస్ సర్కారు సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది యువకులు సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. వారి చావుకు సీఎం కేసీఆర్ కారణమని ఆరోపించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎంయే కారణం అని తెలిపారు. 317 జీవోతో ఎంతో మంది ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అలాగే వరి వేస్తే ఉరే అనే ప్రకటనతో ఎంతో మంది రైతన్నలు చనిపోయారని తెలిపారు. ఈ విషయాలన్నింటీపై సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసు ఇవ్వాలని కేటీఆర్ కు సూచించారు.
ఎవని పాలయిందిరో తెలంగాణ...: టీఆర్ఎస్ కు ఖరీదైన ప్రభుత్వ స్థలం కేటాయింపుపై రేవంత్ సీరియస్
దళితుడిని సీఎం చేస్తామని, దళితులకు మూడెకరాలు ఇస్తామని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని టీఆర్ఎస్ మోసం చేసిందని, ఈ విషయంపై 420 కేసు పెట్టాలని తెలిపారు. త్వరలో జరగబోయే తమ మీటింగ్ కు లక్షలాది మంది వస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని, అందుకే ఏం చేయాలో తెలియక లీగల్ నోటీసులతో డ్రామాలాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ఎన్నో సార్లి కొట్లాడి జైలుకు వెళ్లానని, తనకు జైలు కొత్తదేమీ కాదని అన్నారు.
