వావివరసలు మరిచి ఓ తండ్రి తన కూతురితోనే మృగంలా ప్రవర్తించాడు.  కన్న కూతురని కూడా చూడకుండా మైనర్ పై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన తల్లి అప్రమత్తమవడంతో బాలిక ఈ కామాంధుడి బారినుండి సురక్షితంగా బైటపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

దిల్‌సుఖ్ నగర్ లో నివాసముండే సమీర్ షరీఫ్ మొదటి భార్యతో గొడవ పడి విడిపోయాడు. దీంతో ఫాతిమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. 

అయితే ఈ నెల 23వ తేదీన ఇంట్లో ఎవరూ లేసి సమయంలో షరీఫ్ తన పదకొండేళ్ల పెద్ద కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. తండ్రి అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిపోయిన చిన్నారి ఏడవటం ప్రారంభించింది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన తల్లికి ఓ గదిలోంచి కూతురి ఏడుపు వినబడ్డాయి. దీంతో ఆ గది తలుపులు తెరవగా తన భర్త కూతురితో నీచంగా ప్రవర్తిస్తుండటాన్ని చూసింది. దీంతో అతడి నుండి కూతురికి కాపాడింది.

ఫాతిమా స్థానికులకు ఈ విషయం తెలిపి భర్తను పట్టుకోడానికి ప్రయత్నించినా అప్పటికే అతడు పరారయ్యాడు. దీంతో ఆమె ఈ సంఘటన గురించి స్థానిక పోలీసులకు తెలిపి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.