Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల కూతురిని గంటెతో కొట్టి.. నేలకేసి విసిరేసిన తండ్రి.. చిన్నారి పరిస్థితి విషమం..

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన మూడేళ్ల చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఆమెను నేలకేసి కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.

father threw his three-year-old daughter on the ground, child's condition is critical in hyderabad
Author
Hyderabad, First Published Aug 8, 2022, 7:19 AM IST

హైదరాబాద్ : ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తె పాలిట యముడిలా మారాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఇష్టారీతిన కొట్టడంతో పాటు.. నేలకేసి విసిరికొట్టి.. బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్లోని సైఫాబాద్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ నివాసి బాసిత్ అలీఖాన్, మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఫస్ట్ లాన్సర్ కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఏసీ గార్డ్స్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి.  ఆటో డ్రైవర్ గా వచ్చే సంపాదన చాలక ఇతర కారణాలతో బాసిత్ కొన్నాళ్లుగా పిల్లలపై విపరీతంగా కోప్పడ్డం, కొట్టడం చేస్తున్నాడు.  

శనివారం సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కుమార్తె  సకీనా ఫాతిమా(3) బాత్రూంలో ఆడుకుంటుంది. బయటికి రమ్మని తండ్రి పిలిస్తే వెళ్లలేదు. దీంతో పట్టలేని కోపంతో గంటెతో ఇష్టం వచ్చినట్లు ఆ చిన్నారిని కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. గట్టిగానే నెట్టడంతో కింద పడిన ఆమె స్పృహ తప్పింది. తర్వాత కుమార్తెను పైకి ఎత్తి నేలకేసి కొట్టి బయటకి వెళ్ళిపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత కుమార్తెను చూసిన తల్లి నిద్ర పోతుంది అని భావించింది. కొద్దిసేపటి తర్వాత పాలు పట్టేందుకు  లేపడానికి ప్రయత్నించగా, శరీరం చల్లగా ఉండటం. నోటి నుంచి రక్తం రావడంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది.

పొలాన్ని లాక్కొనే కుట్ర.. రైతు ఆత్మహత్య, కొడుకు మృతితో తల్లీ కూడా సూసైడ్: బండి సంజయ్ దిగ్భ్రాంతి

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఉస్మానియాలోని ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాసిత్ ఉస్మానియా వద్దకు వెళ్లి కుమార్తెను చూసి చేష్టలుడిగి అలాగే కూలబడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త పై కేసు నమోదు చేశారు.  భర్త బాసిత్ జైలుకు వెళితే తన పరిస్థితి ఏమిటని భార్య సనా ఫాతిమా కన్నీరుమున్నీరవుతోంది. 

ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే ఏపీలోని అనంతపురంలో జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బిడ్డ తన పోలికలతో లేదంటూ రెండు నెలల చిన్నారిని కన్న తండ్రే అత్యంత దారుణంగా హత్య చేశాడు. భర్త మల్లికార్జున్ కు బిడ్డ తన పోలికలతో లేదని అనుమానం వచ్చింది. దీంతో భార్య చిట్టెమ్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పట్టరాని కోపంతో భార్య లేని సమయంలో చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాకుండా చంపేశాడు. అంతటితో ఆగకుండా  చిన్నారి మృతదేహన్ని గోనెసంచిలో వేసి కట్టేసి, చెరువులో పడేశాడు.

విషయం తెలియని చిట్టెమ్మ చిన్నారి కన్పించకపోయేసరికి అంతా వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే,  చిన్నారిని చంపిన మల్లిఖార్జున్ బెంగుళూరుకు పారిపోయాడు. ఆ తరువాత ఆ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. మల్లిఖార్జున ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెరువు నుండి చిన్నారి మృతదేహన్ని వెలికి తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios