ఖమ్మం జిల్లాలో విషాదం : కరెంట్ షాక్ కు గురై తండ్రీ కొడుకులు మృతి

Father and Son Killed by Electric shock
Highlights

పొలం దున్నతుండగా ట్రాక్టర్ కి విద్యుత్ తీగలు తగిలి షాక్

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తాకి కరెంట్ షాక్ గురై గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ తో పాటు అతడి కుమారుడు మృత్యువాతపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సమీపంలోని బల్లెపల్లికి  చెందిన రైతు బారోతు శంకర్ పంచాయితీ వార్డు మెంబర్ గా గత ఎన్నికల్లో ఎన్నికయ్యాడు. ఇతడు గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు వ్యవసాయం కూడా చేస్తుంటాడు. వర్షాకాలం మొదలవుతుండటంతో పంట వేయడానికి పొలంలో స్వయంగా తానే ట్రాక్టర్ తో దున్నుతుండగా హటాత్తుగా ప్రమాదానికి గురయ్యాడు. ట్రాక్టర్ కు విద్యుత్ తీగలు తాకడంతో శంకర్ తో పాటు అతడి కొడుకు వెంకటేశ్ మృతి చెందారు. 

హటాత్తుగా ఇద్దరు కుటుంబ సభ్యులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

loader