అయోధ్యలో బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు దుర్మరణం, 40 మందికి గాయాలు
అయోధ్యలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. అయోధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 40 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.
అయోధ్యం: ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దారుణం జరిగింది. లోడ్‌తో వస్తున్న ట్రక్కు, ప్రయాణికులతో వెళ్లుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.
అంబేడ్కర్ నగర్ వైపు వెళ్లడానికి బస్సు ప్రయత్నించింది. దారి మళ్లే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ట్రక్కు వ్యతిరేక దిశలోనే బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు బోల్తా కొట్టింది. ఫలితంగా బస్సును పూడ్చిపెట్టినట్టుగా మారిపోయింది.
ఇప్పటి వరకు నలుగురు మరణించారని, ఈ ప్రమాదంలో 40 మంది మరణించారని అయోధ్య మెడికల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ రాజా తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వివరించారు.
Also Read: ఢిల్లీలో దొంగతనం కేసు.. నలుగురు పోలీసులు అరెస్టు
డజన్‌కు మించి అంబులెన్స్‌లు స్పాట్ చేరుకున్నాయి. ఆ వాహనంలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాయి. క్షతగాత్రులను జిల్లా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమర్ తెలిపారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధపడ్డట్టు ఆయన కార్యాలయం హిందీలో ఓ ట్వీట్ చేసింది.