నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బైక్ పై నుంచి పడి యువకుడు మృతి..

ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెనకాల కూర్చున్న యువకుడు కింద పడ్డాడు. అతడు తీవ్ర గాయాలపాలవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది.

Fatal accident in Nizamabad district.. A young man fell off his bike after being hit by an RTC bus..ISR

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న యువకుడు కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బోదాసు రంజిత్ (19), బోదాస్ గంగాధర్ అనే యువకులు జీవిస్తున్నారు. వీరిద్దరూ వరసకు అన్నదమ్ముల్యే వీరిద్దరూ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష.. నా తండ్రికి ఏమైనా జరిగితే జగన్ సర్కార్ దే బాధ్యత - నారా లోకేశ్‌

కాగా.. ఇప్పటిలాగే శుక్రవారం కూడా వారిద్దరూ పని కోసం నిజామాబాద్ కు బైక్ పై వస్తున్నారు. గంగాధర్ బైక్ డ్రైవింగ్ చేయగా.. రంజిత్ వెనకాల కూర్చొని ప్రయాణం సాగించాడు. వీరి బైక్ ముబారక్‌నగర్‌ సుజిత్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే.. జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెనకాల కూర్చొని ఉన్న రంజిత్ ఒక్కసారిగా కింద పడిపోయాడు.

తాగుడుకు బానిసై భార్యతో గొడవ.. నాలుగు నెలల గర్భిణీకి నిప్పంటించి, కుమారుడితో పరారైన భర్త.

ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఫ్యాక్టరీకి చెందిన లారీలు రోడ్డుపై ఉంచడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుడి బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా రోడ్డుపై బైఠాయించి, నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కల్పించుకొని, తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించడంతో, పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios