చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష.. నా తండ్రికి ఏమైనా జరిగితే జగన్ సర్కార్ దే బాధ్యత - నారా లోకేశ్
చంద్రబాబు నాయుడికి ఏమైనా హాని జరిగితే దానికి వైసీపీ ప్రభుత్వం, జైలు అధికారులు బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తన తండ్రి ఏ తప్పూ చేయలేదని ఆయన పునరుద్ఘాటించారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఎందుకు ఈ కక్ష అని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తన తండ్రికి ఏమైనా జరిగితే జగన్ ప్రభుత్వం, అధికారులదే పూర్తి బాధ్యత అని చెప్పారు. వైసీబీ ప్రభుత్వం సిస్టమ్స్ ను మేనేజ్ చేస్తోందని ఆరోపించారు. తన తండ్రిని రిమాండ్ లోనే ఉంచాలని కుట్రకు పాల్పడుతున్నారని తెలిపారు.
తాగుడుకు బానిసై భార్యతో గొడవ.. నాలుగు నెలల గర్భిణీకి నిప్పంటించి, కుమారుడితో పరారైన భర్త.
అనారోగ్య కారణాలు చూపించి, చంద్రబాబు నాయుడిని అంతం చేయాలనే కుట్ర జరుగుతోందని నారా లోకేష్ ఆరోపణలు చేశారు. తన తండ్రి జీవితం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో భద్రత లేదని ఆయన అన్నారు. అక్కడే ఆయన అనారోగ్యానికి గురయ్యేలా చేసి ప్రాణానికి హాని తలపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయలేదని అన్నారు. అయినా జగన్ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందని తెలిపారు.
యుద్ధాలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి - గాజాలో ఇజ్రాయెల్ తరలింపు ఆదేశాలపై యూఎన్ వో చీఫ్ ఫైర్..
తన తండ్రి ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు సందేహాస్పదంగా ఉందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం ఎందుకు ఇంతలా కక్ష గట్టిందని ప్రశ్నించారు. తన తండ్రికి ఏమైనా హాని కలిగితే దానికి వైసీపీ ప్రభుత్వం, జైలు అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. జైలులో దోమలు ఉన్నాయని చెప్పామని, స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆయన గదికి ఉన్న ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.