కేంద్రం పట్టించుకోకున్నా.. తెలంగాణ అండగా నిలుస్తున్నది.. 29న ‘పార్లమెంటు ఛలో’ : ఢిల్లీలో రైతు సంఘాలు

ఏడాదిపాటు సాగిన రైతు ఆందోళనల్లో సుమారు 700 మంది అమరులయ్యారని, ఎన్నో మరణాలను కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే నివారించగలిగేదని, కానీ, ఆ పనిచేయలేదని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఇప్పుడు అమరుల కుటుంబాలనూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ, తెలంగాణ ప్రభుత్వం అమరులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని వివరించింది. అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి అమరుల పేర్ల జాబితాను పంపిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్ష పరిహారం అందించాలన్న సీఎం కేసీఆర్ డిమాండ్‌నూ పేర్కొంది.

farmers to send martyrs list to telangana govt for ex gratia

న్యూఢిల్లీ: వ్యవసాయ సాగు చట్టాల(Farm Laws)ను వెనక్కి తీసుకుంటామని ప్రధానమంత్రి Narendra Modi ఈ నెల 19న ప్రకటించిన తర్వాత ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తున్న రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(SKM) ఈ రోజు సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి KCR చేసిన ప్రకటనపై ప్రధానంగా చర్చ జరిగింది. నివారించదగ్గర మరణాలపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అమరులకూ భరోసాను ప్రకటించలేదని, కానీ, తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని పేర్కొంది. రైతు అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షల Ex Gratia ప్రకటించడాన్ని ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని సమావేశానంతరం ఓ ప్రకటనలో సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. అంతేకాదు, ఈ ఆందోళనలు అసువులు బాసిన అమరులకు పరిహారం చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ చేసిన డిమాండ్‌నూ ప్రస్తావించింది. సింఘు సరిహద్దులో రైతులు ఈ రోజు సమావేశమయ్యారు. అంతేకాదు.. ఈ నెల 29 చలో పార్లమెంటు కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ఈ సమావేశంలో రైతు నేతలు స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

రైతుల ఆందోళనలో చాలా మరణాలను కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే నివారించ గలిగేవని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ ఆందోళనలు సుమారు 700 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోయిందని, కనీసం రైతు అమరుల కుటుంబాలకు భరోసాగా ఏ ప్రకటనా చేయలేదని వివరించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని వివరించింది. అమరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపింది. అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షలు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారని వివరించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 25 లక్షలు అందించాలని డిమాండ్ చేశారని పేర్కొంది. అంతేకాదు, ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారని వివరించింది. పరిహారం అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి రైతు అమరుల జాబితాలను అందిస్తామని తెలిపింది. అలాగే, ట్విట్టర్‌లో కేటీఆర్ ట్వీట్‌ను సంయుక్త కిసాన్ మోర్చా ట్యాగ్ చేసి ట్వీట్లు చేసింది.

Also Read: 700 మంది చనిపోయారు, రైతులకు సారీ చెబితే చాలా.... రేపు ఢిల్లీలో తాడోపేడో : కేసీఆర్

ఏడాది పాటు పోరాడిన రైతులందరికీ ఈ సమావేశంలో రైతు నేతలు అభినందనలు తెలిపారు. తమ ఆందోళనలకు సంబంధించి సాగు చట్టాల రద్దు మినహా ఇతర డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాయాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏవైనా విషలు ముందుకు వస్తే ఈ నెల 27వ తేదీన సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 

Also Read: పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట, మరి తెలంగాణలో సంగతేంటీ: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

22వ తేదీన యూపీ రాజధాని లక్నోలో నిర్వహించతలపెట్టిన కిసాన్ మహాపంచాయత్‌లో పెద్దమొత్తంలో ప్రజలు పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. 24వ తేదీన చోటు రామ్ జయంతి పురస్కరించుకుని నిర్వహించనున్న కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్, 26న ఢిల్లీ బార్డర్ మోర్చే పే చలో, అన్ని రాష్ట్రా స్థాయి ఆందోళనలు, 29న పార్లమెంటు చలో కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయని వివరించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios