పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట, మరి తెలంగాణలో సంగతేంటీ: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana cm kcr) కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల (telangana farmers) కోసమా..? పంజాబ్ రైతుల (punjab farmers) కోసమా అని ఆయన ప్రశ్నించారు.

telangana bjp chief bandi sanjay fires on cm kcr over farm laws

తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana cm kcr) కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay). ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ దీక్ష (kcr deeksha) చేస్తే ఢిల్లీ దిగొచ్చిందంట అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల (telangana farmers) కోసమా..? పంజాబ్ రైతుల (punjab farmers) కోసమా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఫాంహౌజ్ (kcr farmhouse) నుంచి ధర్నాచౌక్ దగ్గరకు తీసుకొచ్చామని బండి సంజయ్ గుర్తుచేశారు. 

కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయాడు ..? అక్కడ ఏం పనుందని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనమని చెబితే కొనలేదని సంజయ్ మండిపడ్డారు. వానాకాలం పంట కొంటావా..? కొనవా అని మొత్తుకున్నామని.. రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. కానీ టీఆర్ఎస్ (trs) మాత్రం రైస్ మిల్లర్ల గురించే ఆలోచిస్తుందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మాపై దాడులు చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారని.. 40 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యాన్ని కొనేందుకు కేంద్రం ఒప్పుకుందా ..? లేదా చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. 

ALso Read:700 మంది చనిపోయారు, రైతులకు సారీ చెబితే చాలా.... రేపు ఢిల్లీలో తాడోపేడో : కేసీఆర్

కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దంటే ఎక్కడ పోసుకోమంటావని కేసీఆర్‌పై ఆయన ఫైరయ్యారు. పోనీ నీ ఫాంహౌస్‌లో పోసుకోమంటావా అంటూ సంజయ్ మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానమని.. పంజాబ్ రైతులకు మూడు లక్షలు నష్టపరిహారం ఇస్తాడట అంటూ కేసీఆర్‌పై ఫైరయ్యారు. మరి  తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వవా అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వరా అని ఆయన నిలదీశారు. 

చనిపోయిన రైతులకు 20 లక్షలు ఇచ్చి ఆ తర్వాత కేంద్రాన్ని అడగాలని బండి సంజయ్ దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలను (farm laws) ముందుకు వ్యతిరేకించావని.. తర్వాత సమర్ధించావని, ఇప్పుడేమో రైతులకు మూడు లక్షలు ఇవ్వాలంటున్నాడని కేసీఆర్‌పై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులకు రూ.20 లక్షలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల పంట కొని నష్టపోయామని ముఖ్యమంత్రే అన్నారని.. అన్ని మాట్లాడేది నువ్వే, ఎదుటివాళ్లు మాట్లాడితే బూతద్దంలో చూపిస్తామని బండి సంజయ్ ఫైరయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios