Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూముల సర్వే: ఖమ్మం చింతకానిలో అడ్డుకున్న రైతులు

ఉమ్మడి ఖమ్మం  జిల్లాలోని చింతకానిలో రైతులు ఆందోళనకు దిగారు.  గ్రీన్ ఫీల్డ్  హైవేకు  భూముల సర్వేను  రైతుల అడ్డుకున్నారు.

Farmers Protest against Green field Highway survey at Chintakani in Khammam District lns
Author
First Published Jul 23, 2023, 1:17 PM IST

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చింతకానిలో ఆదివారంనాడు ఉద్రిక్తత నెలకొంది.  గ్రీన్‌ఫీల్డ్  హైవే కోసం  అధికారులు సర్వే నిర్వహించడంపై రైతులు  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.  సర్వేను  రైతులు అడ్డుకున్నారు. సర్వేను నిర్వహిస్తూ  రైతులు, రైతు సంఘం నేతలు  ఆందోళనకు దిగారు.

ఖమ్మం- విజయవాడ మధ్య నాలుగు లైన్లతో  గ్రీన్ ఫీల్డ్ హైవేను  రూ. 983. 90 కోట్లతో నిర్మించనున్నారు.405 కి.మీ. నాగ‌పూర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా  ఈ గ్రీన్ ఫీల్డ్  హైవేను నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణానికి  రైతుల నుండి భూములను సేకరిస్తున్నారు. అయితే  ప్రభుత్వం   కేవలం  రూ. 20 నుండి రూ.25 లక్షల మేరకు మాత్రమే పరిహారం  ఇస్తామని అధికారులు చెప్పడంపై   రైతులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో  ఎకరం భూమికి రూ.కోటి ఉంటుందని రైతులు చెబుతున్నారు. కోటి రూపాయాల విలువ చేసే భూమికి రూ. 20 నుండి రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వడంపై మండిపడుతున్నారు.  ఇవాళ  భూముల సర్వేకు  వచ్చిన అధికారులను  రైతులు, రైతు సంఘాల నేతలు అడ్డుకున్నారు.   స్థానికంగా ఉన్న ధర ప్రకారంగా పరిహారం  చెల్లించాలని డిమాండ్  చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios