హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన హలియాలో  సీఎం కేసీఆర్ సభను రద్దు చేయాలని కోరుతూ రైతులు తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.తమ భూముల్లో అనుమతి లేకుండా ఈ సభను నిర్వహిస్తున్నారని  కొందరు రైతులు ఈ నెల 12వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సభ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో భారీ సంఖ్యలో జనం ఒకే చోట గుమికూడవద్దని ప్రభుత్వం జారీ చేిస జీవోలను ప్రస్తావిస్తూ ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని కోరారు.

also read:హలియాలో కేసీఆర్ సభ రద్దుకు పిటిషన్: రైతులకు హైకోర్టు షాక్

అయితే ఈ పిటిషన్లను విచారించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఇవాళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు స్వీకరిస్తోందా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.ఈ నెల 15వ తేదీతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచారానికి తెరపడడానికి ఒక్క రోజు ముందుగానే హలియాలో సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు.