Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డిలో విషాదం.. అందరూ చూస్తుండగా సెల్ టవర్ కు ఉరేసుకుని రైతు ఆత్మహత్య..

కామారెడ్డిలో అధికారుల నిర్లక్షానికి ఓ రైతు బలయ్యాడు. తన పొలంగుండా వెడుతున్న కాలువ నీటిని దారి మళ్లించాలని చేసిన అభ్యర్థనలు పట్టించుకోకపోవడంతో సెల్ టవర్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer suicide in full public view in kamareddy
Author
First Published Dec 6, 2022, 9:37 AM IST

కామారెడ్డి : కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల ఓ రైతు సోమవారం కామారెడ్డిలో సెల్‌ఫోన్ టవర్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టవర్ ఎక్కిన రైతును గుర్తించిన గ్రామస్థులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బలిమిలాడారు. అయినా ఆ రైతు వారి మాట వినలేదు. లింగాపూర్ మండలం మెంగారం గ్రామానికి చెందిన పి ఆంజనేయులుగా గుర్తించారు. 

ఆంజనేయులుకు లింగాపూర్ మండలం మెంగారం గ్రామంలో ఒక గుంట పొలం ఉంది. దీనిగుండా కెనాల్ నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల పొలం పండించుకోలేకపోతున్నానని.. నీళ్లు తన పొలంలోకి రాకుండా చేయాలని.. ప్రభుత్వాధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేశాడు. కానీ ఫలితం శూన్యం. దీంతో విసిగిపోయిన ఆంజనేయులు సోమవారం ఈ దారుణానికి తెగించాడు. సోమవారం ఉదయం తన గోడు అధికారులు పట్టించుకోవడం లేదని ట్రక్కు ముందు దూకుతానని బెదిరించడంతో ఉదయం హై డ్రామా జరిగింది.

దీంతో గ్రామస్తులు అతన్ని అడ్డుకున్నారు. "మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు, ఆంజనేయులు గ్రామంలోని సెల్‌ఫోన్ టవర్‌పైకి ఎక్కాడు. తన పొలంలోనుంచి పారుతున్న నీటిని వెంటనే ఆపకపోతే అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రెవెన్యూ అధికారులను బెదిరించాడు" అని కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

నమ్మితే.. నట్టేట ముంచాడు.. ఇన్ స్టాగ్రామ్ లవ్ ఆస్ట్రాలజర్ పేరుతో లేడీ టెక్కీకి రూ.47లక్షలు టోకరా...

పోలీసు అధికారులు, తహశీల్దార్‌లు అతనికి కౌన్సెలింగ్‌ చేసి దిగిరావాలని, శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని టవర్‌పై నుంచి కిందకు దిగాలని వేడుకున్నారు. అయితే అధికారులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్నా.. అతను దిగిరాలేదు. వారంతా చూస్తుండగానే ఆంజనేయులు తన వెంట తెచ్చుకున్న టవల్‌తో టవర్‌పై ఉన్న రాడ్‌కు ఉరివేసుకున్నాడు.

ఆంజనేయులు భూమిలోనుంచి పక్కనే ఉన్న కాల్వ నీరు ఇతర పొలాలకు ప్రవహిస్తోంది. దీంతో ఆంజనేయులు తన భూమిలో సాగు చేసుకోలేకపోతున్నాడని అధికారులు తెలిపారు. దీనిమీద పలుమార్లు నిరసనల అనంతరం తహశీల్దార్‌ రూ.2000 పరిహారం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండడంతో, భూమిని సాగు చేసుకోలేక పోతున్నాననే మనస్తాపానికి గురయ్యాడని గ్రామస్తులు తెలిపారు. సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios