Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి: గుండెపోటుతో రాజయ్య డెత్

కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు రాజయ్య గుండెపోటుతో మరణించారు. 

Farmer dies at paddy purchase center in Kama reddy district
Author
Kamareddy, First Published Nov 26, 2021, 11:17 AM IST


 నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని  సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే రైతు  రాజయ్య గుండెపోటుతో మరణించారు.  రాజయ్య మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. ధాన్యం కుప్ప పోస్తున్న సమయంలోనే రైతు రాజయ్య మరణించాడు. ధాన్యం విక్రయించేందుకు రాజయ్య ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చినట్టుగా గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలోని  సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే రైతు  రాజయ్య గుండెపోటుతో మరణించారు.  రాజయ్య మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. ధాన్యం కుప్ప పోస్తున్న సమయంలోనే రైతు రాజయ్య మరణించాడు. ధాన్యం విక్రయించేందుకు రాజయ్య ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చినట్టుగా గ్రామస్తులు తెలిపారు. 

also read:ఢిల్లీకి పోయిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు.. కేసీఆర్ పై షర్మిల సెటైర్లు...
Kama reddy జిల్లాలో గతంలో కూడా ఓ farmer ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మరణించాడు. లింగంపేట మండలానికి చెందిన బీరయ్య అనే రైతు ఈ నెల 6వ తేదీన మరణించాడు. అక్టోబర్ 27న ఐకేపీ కేంద్రానికి బీరయ్య తన Paddy ధాన్యాన్ని తీసుకొచ్చాడు. తన వంతు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మొత్తం 207 మంది రైతుల్లో బీరయ్య కు అధికారులు 70 నెంబర్ కేటాయించారు.  వరుసగా వర్షాలు కురవడంతో పాటు Diwaliసెలవుల నేపథ్యంలో  ధాన్యం కొనుగోలు విషయమై ఆలస్యం కావడంతో  ఆందోళనకు గురైన బీరయ్య మరణించాడు.ధాన్యం కొనుగోలు విషయమై  బీజేపీ, టీఆర్ఎస్  నేతల మాటల యుద్దం కొనసాగుతుంది.  యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై  కేంద్రం నుండి స్పష్టత  ఇవ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వర్షాకాలంలోని ధాన్యం కొనుగోలు చేయాలని  బీజేపీ డిమాండ్ చేస్తోంది. వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. 

ప్రతి ఏటా రాష్ట్రం నుండి ఎంత ధాన్యాన్ని సేకరిస్తారనే విషయమై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. అయితే ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టత రాలేదు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకొంటానని కేసీఆర్ ఈ నెల 21న  ఢిల్లీకి వెళ్లారు. అయితే  ఢిల్లీ నుండి కేసీఆర్ తిరిగి వచ్చారు. అయితే  కేంద్రం నుండి కేసీఆర్ ఉత్త చేతులతోనే తిరిగి వచ్చారని  విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషఁయమై కేంద్ర మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది. మరో వైపు ఇదే విషయమై పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది..వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయనుంది.  ఈ మేరకు అన్ని వేదికలను ఉపయోగించుకోనుంది. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఖరిని కూడా బీజేపీ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకొంటూ రైతులను నట్టేట ముంచుతున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. రెండు పార్టీలకు రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ది లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios