ప్రేయసి కోసం స్విట్జర్లాండ్ వెళ్లినన ఓ యువకుడు పాక్ చెరలో చిక్కుకున్నాడు. ఓ హైదరాబాదీ యువకుడు గూఢచర్యం నేపథ్యంలో పాకిస్థాన్ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. కాగా అతనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి.

ప్రశాంత్‌ తండ్రి బాబూరావుది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామం. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీకాంత్‌, చిన్నవాడు ప్రశాంత్‌. ఉద్యోగరీత్యా(ప్రైవేటు) బాబూరావు విశాఖపట్నంలోని వుడా మిథిలాపురికాలనీ.. గంగారెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఉండేవారు. ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కావడం గమనార్హం.

AlsoRead పాక్ బందీగా తెలుగు టెక్కీ ప్రశాంత్: ఆసక్తికర విషయాలు వెల్లడించిన తండ్రి...

ఈ నేపథ్యంలో.. కుటుంబం మొత్తం ఐదేళ్ల క్రితమే విశాఖ నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చారు. ఐదేళ్ల క్రితం కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీకి మారారు. కాగా...గత రెండేళ్లుగా ప్రశాంత్ ఆచూకీ తెలీకపోగా... తాజాగా పాకిస్తానీ అధికారులు అతని వీడియోని విడుదల చేశారు. దీంతో అతను పాక్ చెరలో చిక్కుకున్నట్లు తెలిసింది.  కాగా... కూకట్ పల్లి, విశాఖలోని ప్రశాంత్ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు.

కాగా...పాక్ చెరలో ఉన్న ప్రశాంత్ ని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కృషి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ చెప్పారు.

ఇదిలా ఉంటే... 2011-12లో)ప్రశాంత్‌ బెంగళూరులోని హువేయి టెక్నాలజీస్ లో కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగంలో చేరాడు. ఆ కంపెనీ తరఫున చైనా, దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాడు. అప్పట్లోనే స్వప్నికాపాండే అనే తోటి ఉద్యోగితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలమవ్వడంతో.. మానసికంగా కృంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. మానసిక చికిత్స చేయించారు.

AlsoRead పాక్ లో ప్రశాంత్ బందీ: స్విట్జర్లాండ్ లోని ప్రేయసిని కలిసేందుకు వెళ్తూ......

కోలుకున్న ప్రశాంత్‌ 2016లో మాదాపూర్‌లోని షోర్‌ ఇన్ఫోటెక్‌లో చేరారు. 2017 ఏప్రిల్‌ 11న ఉద్యోగానికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. ప్రశాంత్‌ తండ్రి బాబూరావు అదే నెల 29న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. క్లూ దొరక్కపోవడం.. గతంలోనూ ప్రశాంత్‌ ఇం ట్లోంచి పారిపోయాడని తల్లిదండ్రులు చెప్పడంతో కేసును మూసివేశారు.
 
కాగా, తాను ప్రేమించిన స్వప్నికాపాండే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రశాంత్‌ ఆ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. స్వప్నికాపాండే స్వస్థలం మధ్యప్రదేశ్‌. ఆమెను వెతికే క్రమంలోనే అతడికి దరీలాల్‌ పరిచ యం అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్‌ ఆమెను వెతికేందుకు దరీలాల్‌ సహాయం తీసుకుని ఉంటాడని.. ఆ క్రమంలో రాజస్థాన్‌ థార్‌ ఎడారిలో తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దులు దాటి ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ప్రశాంత్‌ స్విట్జర్లాండ్‌కు కాకుండా రాజస్థాన్‌ ఎందుకు వెళ్లాడనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. ఇదిలావుంటే, ప్రశాంత్‌ తండ్రిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు.