ఫేక్ సర్టిఫికెట్ల స్కాంలో ఎంఐఎం పాత్ర ఉండొచ్చని బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వారికి కూడా జారీ చేశారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం మీద సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్నిసిబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం అంతా పాత బస్తీ కేంద్రంగానే జరిగిందని…సర్టిఫికెట్ల జారీ స్కామ్ లోఎంఐఎం పాత్ర కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్. ఈ నేపథ్యంలోనే ఈ నకిలీ సర్టిఫికెట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కి చెందిన వారికి కూడా అంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

జిహెచ్ఎంసి బర్త్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది. అయితే దీనివల్ల మొదటికే మోసం వచ్చింది. వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భర్త సర్టిఫికెట్ల స్కాం వెలుగులోకి రావడం వల్ల వినిపిస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఎక్కువ తక్కువ జారీ చేసేశారు. వీటితోపాటు గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా నాన్ అవైలబిలిటీ పేరుతో 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే: సీఐఐ సదస్సులో కేటీఆర్

ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా కొంతమంది ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరి కొంతమందికి పాస్పోర్ట్లు వీసాలు కూడా మంజూరయ్యాయి. ఈ ఫేక్ సర్టిఫికెట్ల వల్ల భీమా డబ్బుల కోసం ఫేక్ డెత్ సర్టిఫికెట్లను వాడినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లది కీలక పాత్రగా పోలీసులు నిర్ధారించారు. మీసేవ సిబ్బందితో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఈ సర్టిఫికెట్లు జారీ చేసినట్లుగా సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు గత డిసెంబర్లో మొగల్పురాలోని మూడు మీసేవ సెంటర్లలో తనిఖీలను చేపట్టారు.

ఆ తనిఖీల్లో ఈ నకిలీ సర్టిఫికెట్లు వందలకొద్దీ వెలుగు చూశాయి. అది చూసి షాక్ అయిన వారు వెంటనే ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసి కూడా ఈ పోలీసుల తనిఖీలతో మేల్కొంది.. అప్పుడు మొదలుపెట్టి దర్యాప్తు ప్రారంభిస్తే గ్రేటర్ హైదరాబాద్ లోని 30 సర్కిళ్లలో ఈ వ్యవహారం జరిగినట్లుగా గుర్తించారు. దీంతో మొత్తం 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లుగా జిహెచ్ఎంసి ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది.