అబ్దుల్లాపూర్ జంట హత్యలు : వివాహేతర సంబంధమే, యశ్వంత్ మర్మాంగం ఛిద్రం
అబ్దుల్లాపూర్ మెట్ లో కలకలం రేపిన జంటహత్య కేసులో వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు పోలీసులు. మంగళవారం వెలుగులోకి వచ్చిన మృతదేహాల కేసులో పురోగతి సాధించారు.
హైదరాబాద్ : Abdullapurmet జంట హత్య కేసులో పోలీసులు విచారణ జరిపారు. క్యాబ్ డ్రైవర్ యశ్వంత్, జ్యోతికి Extramarital affair ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధమే Murderకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులను ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. యశ్వంత్ మర్మాంగాన్ని హంతకులు ఛిద్రం చేశారు. జ్యోతి ముఖంపై రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు గాలిస్తున్నారు.
కాగా అబ్దుల్లాపూర్మెట్ లో మృతదేహాల కలకలం రేగింది. కొత్త గూడెం బ్రిడ్జి దగ్గర జంట మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మూడు రోజుల క్రితం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిపోయిన స్థితిలో మహిళ, యువకుడి మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులు కవాడిగూడ వాసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ దారుణం వెలుగుచూసింది. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో యువతీయువకుల మృతదేహాలు కలకలం రేపాయి. దుర్వాసన వస్తుండడంతో అక్కడికి వెళ్లి చూసిన స్థానికులు డెడ్ బాడీలు కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతీ యువకుల మృతదేహాలు నగ్నంగా పడి ఉండగా, యువతి మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. హత్యచేసి తగలబెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. యువకుడి పేరు యశ్వంత్ గా, యువతి పేరు జ్యోతిగా గుర్తించారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్ చేసింది జ్యోతి. ఆమె బ్యాగులో ఉన్న షాపింగ్ బిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ ఆ బిల్స్ చెల్లించినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నించగా.. జ్యోతి తన స్నేహితురాలు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు యువతీ, యువకులు బైక్పై వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆరోజే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన యశ్వంత్ ఇప్పుడు విగతజీవిగా కనిపించాడు అని అంటున్నారు అతని సోదరుడు. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గా పని చేసేవాడు అని చెబుతున్నాడు. మృతి చెందిన యువతి జ్యోతి గురించి తనకు ఏమీ తెలియదని.. ఎవరు చంపారో కూడా తెలియదని.. యశ్వంత్ సోదరుడు అంటున్నాడు. నీరజ్ అనే వ్యక్తి యశ్వంత్ తో తరచూ గొడవ పడేవాడు అని తెలిపాడు ఎప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజు వస్తుంటే వాటిని అలాగే తిరిగి వస్తాడని భావించామని చెప్పాడు. ఈ ఉదయం పోలీసులు ఫోన్ చేస్తేనే యశ్వంత్ చనిపోయినట్లు తెలిసింది అతను పేర్కొన్నాడు. మరోవైపు యశ్వంత్, జ్యోతిలది హత్యగానే భావిస్తున్నామన్నారు డీసీపీ. జ్యోతికి ఇప్పటికే వివాహం జరిగిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆమె భర్తను విచారించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డిసిపి మంగళవారం తెలిపారు. ఇద్దరు వారాసిగూడకు చెందిన వారేనని ఆయన తెలిపారు.