Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : ఐస్ క్రీంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం..

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కూతురిమీద కన్నేసిన ఓ కామాంధుడు.. ఆ చిన్నారికి ఐస్ క్రీంలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డాడు. 

Extra-marital affair: Raped a nine-year-old girl by adding drugs to the ice cream In Nizamabad
Author
First Published Aug 30, 2022, 12:13 PM IST

నిజామాబాద్ : ఐస్ క్రీంలో మత్తుమందు కలిపి ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. ఆర్మూర్ మండలంకు చెందిన టిఆర్ఎస్ నేత చంద్రశేఖర్ గ్రామ వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెపై చంద్రశేఖర్ కనపడింది. ఆదివారం బాలిక తల్లి కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్లగా.. ఎవరూ లేని సమయం చూసి చంద్రశేఖర్ ఆమె ఇంటికి వెళ్లాడు. 

బాలికకు ఐస్ క్రీమ్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆర్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో తన బైక్ పైనే నిజామాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రి సిబ్బందికి బాలిక తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి పరారయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది ఘటనపై ఆరా తీయగా విషయం వెలుగుచూసింది. జరిగిన దారుణంపై బాలిక తల్లి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చంద్రశేఖర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.

మూడేళ్ల బాలుడిపై తల్లి, ప్రియుడు కిరాతకం.. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని పాశవికం...చికిత్స పొందుతూ మృతి..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూలైలో నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లాలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని దళిత వాడుకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. 

ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు సంతానంతో అంజయ్య వద్దనే ఉంటోంది. కాగా, అంజయ్య ఆమె కూతురిపై కన్నేశాడు. ఆమెను తెలియకుండా.. అతను గత ఆరు నెలలుగా కూతురిపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. అయినా ఆమె పట్టించుకోలేదు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసేందుకు అంజయ్య మళ్లీ ప్రయత్నించాడు. ఇది గమనించి బాధిత బాలిక పదేళ్ల సోదరుడు కేకలు వేశాడు. అది విన్న స్థానికులు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అంజయ్య ఘాతుకం బయటపడింది. అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios