Asianet News TeluguAsianet News Telugu

‘బిగ్ బాస్ షో’ కి ఎక్సైజ్ పోలీసులు

  • చలో బిగ్ బాస్ షో అంటున్న ఎక్సైజ్ పోలీసులు
  • ముమైత్ ఖాన్ ను బిగ్ బాస్ షో లోనే విచారించే చాన్స్
  • త్వరలోనే పూనేకు పయనమవుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ 
Excise police to go to bigboss to question mumaith khan in drugs case

డ్రగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరుసపెట్టి డ్రగ్ మాఫియా సూత్రదారులు, పాత్రదారులకు ఎన్ ఫోర్స్  మెంట్ నోటీసులు జారీ చేస్తున్నది. డ్రగ్ సప్లై చేస్తున్నవారిని అరెస్టులు కూడా చేసింది. ఇంకొంత మందికి నోటీసులు అందుతాయని, ఇంకొందరిని అరెస్టు చేస్తారని ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. డజనుకు  పైగా సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే. కానీ... ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి.

సినీ ప్రముఖులైన రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్ తదితరుల పేర్లు డ్రగ్ కేసులో వెలుగులోకి వచ్చాయి. అందులో కొందరికి నోటీసులు అందాయి. ఇంకొందరికి నోటీసులు జారీ కానున్నాయి. వారు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశాలు పంపింది. ఇక్కడే ఎక్సైజ్ వారికి కొత్త చిక్కు వచ్చింది. ప్రస్తుతం పూనేలో బిగ్ బాస్ షో ప్రోగ్రాం షూటింగ్ నడుస్తున్నది. ఆ ప్రోగ్రాంలో ప్రస్తుతం ముమైత్ ఖాన్ పార్టిసిపెంట్ గా ఉన్నారు. ఆమె బిగ్ బాస్ షో పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదన్నది ఆ షో నిర్వాహకులు చెబుతున్నమాట. కాబట్టి ఈనెల 20వ తారీకున ముమైత్ ఖాన్ ను విచారణకు రమ్మని ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ వారు తాఖీదు పంపేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె పూనే లో బిగ్ బాస్ షో లో ఉండిపోయింది. దీంతో ముమైత్ ఖాన్ ను విచారించాలంటే అక్కడికే వెళ్లనున్నారు ఎక్సైజ్ అధికారులు.  

నిజానికి మహిళలు కానీ, మైనర్లు (చిన్న పిల్లలు) కానీ డ్రగ్ కేసులో నిందితులైనా, సాక్షులైనా వారు రాలేకపోతే వారి వద్దకే వెళ్లి విచారణ జరపాలన్నది డ్రగ్స్ చట్టంలో ఉన్నట్లు ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. దీంతో ఆ వెసులుబాటును ముమైత్ ఖాన్ ఉపయోగించుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక చేసేది లేక ఎన్ ఫోర్ష్ మెంట్ వారు చలో పూనే అని పొలోమంటూ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే బిగ్ బాస్ షో కి ఎక్సైజ్ పోలీసులు వెళ్లి హల్ చల్ చేయబోతున్నారన్నమాట. ముమైత్ ఖాన్ ఆ మజాకా అంటున్నారు సినీ జనాలు.

Follow Us:
Download App:
  • android
  • ios