huzurabad by poll: ఈటల గెలుపు, కాంగ్రెస్ ఓటమి .. ఊహించినదే, రేవంత్ వల్ల కాలేదు : పొన్నం వ్యాఖ్యలు
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) కూడా హుజూబాద్‌లో ఈటెల విజయావకాశాలపై స్పందించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల గెలవాలని బండి సంజయ్ (bandi sanjay) కోరుకోలేదని.. ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోలేదని, ఇది పూర్తిగా ఈటల గెలుపేనని ప్రభాకర్ అభివర్ణించారు.
హుజూరాబాద్ (huzurabad by poll) ఉప ఎన్నికల ఫలితాలు అటు టీఆర్ఎస్‌లోనే కాకుండా.. కాంగ్రెస్‌లోనూ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్నా .. పార్టీ పట్టించుకోలేదని ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలు ఖాళీగా ఉన్నా కాంగ్రెస్ దీనిపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) కూడా హుజూబాద్‌లో ఈటెల విజయావకాశాలపై స్పందించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ ఫలితాలు ఊహించినట్లుగానే వస్తున్నాయని పొన్నం అన్నారు. అప్రజాస్వామికంగా మంత్రి వర్గం నుంచి తొలగించారనే అంశాన్ని ఈటల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ప్రభాకర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని.. ఇది బీజేపీ విజయంగా బండి సంజయ్ చెప్పడం దురదృష్టకరమని పొన్నం ఎద్దేవా చేశారు. ఈటల గెలవాలని బండి సంజయ్ (bandi sanjay) కోరుకోలేదని.. ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోలేదని, ఇది పూర్తిగా ఈటల గెలుపేనని ప్రభాకర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ఓటమి ముందే ఊహించిందేనని.. ఉత్తమ్ పీసీసీగా (uttam kumar reddy) ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి (koushik reddy) మీద దృతరాష్ట్రుడి ప్రేమ చూపించారని ఆయన ఆరోపించారు. అంతిమంగా అది కాంగ్రెస్ (congress) పార్టీకి నష్టం చేసిందని.. రేవంత్ రెడ్డి వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read:శత్రువుకు శత్రువు మిత్రుడు.. మాకు తప్పలేదు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..
అంతకుముందు హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ సరళిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) సంచలన కామెంట్స్ చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్ (Etela Rajender) మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు. ఉప ఎన్నిక ఫలితాలపై స్పందించిన కోమటిరెడ్డి.. ఈ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీ భారీగా డబ్బులు ఖర్చు చేసిందని ఆరోపించారు. కేవలం 5 నెలల్లోనే 5 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. భారీగా డబ్బు పంచినా.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చే తీర్పు ఇస్తున్నారని అన్నారు. ఈటల రాజేందర్ 30 వేల మెజారిటీతో విజయం సాధించబోతున్నాడని అన్నారు.
ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) భారీ షాకివ్వబోతున్నట్టుగా చెప్పారు. శుత్రువుకు శ్రతువు మిత్రుడనే కోణంలో తాము ఈటలకు మద్దతిచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. తాము గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి ఉండేవని.. అలా జరిగితే టీఆర్‌ఎస్ లాభపడేదని వ్యాఖ్యానించారు. ఈటలకు పరోక్షంగా మద్దతిచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలతో తాము ఏకీభించడం లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. హుజురాబాద్‌లో గెలుపు బీజేపీది కాదని.. ఈటల రాజేందర్‌ది అని అన్నారు.