Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసుకు రాజీనామా: కొండా విశ్వేశ్వర రెడ్డి రాసిన లేఖ ఇదీ...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.  రాజీనామా చేయబోతున్న విషయాన్ని నిన్నటివరకు గోప్యంగా ఉంచిన ఆయన.. మంగళవారం ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ex mp konda vishweshwar reddy open letter - bsb
Author
Hyderabad, First Published Mar 17, 2021, 1:28 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.  రాజీనామా చేయబోతున్న విషయాన్ని నిన్నటివరకు గోప్యంగా ఉంచిన ఆయన.. మంగళవారం ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

‘‘కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటీవలే చెప్పాను. పార్టీకి నష్టం జరుగుతుంది ఎవరికీ చెప్పొద్దు అని కోరడంతో ఆయన మాటను గౌరవించి చెప్పలేదు. కానీ, ఇప్పుడు మీడియా ద్వారా అందరికీ తెలిసింది. 

వచ్చే రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తాను. మన ప్రాంత, రాష్ట్ర, దేశ అభివృద్ధికి ప్రజల మంచి కోసం అందరితో చర్చించి.. మంచి నిర్ణయం తీసుకుంటాను. కొత్త పార్టీ పెట్టాలా? ఇండిపెండెంట్ గా ఉండాలా? మరో పార్టీలో చేరాలా? అని అందరితో కలిసి చర్చిస్తా. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎవరిపైనా ఒత్తిడి చేయను. 

అందుకే పార్టీ బయటకు వచ్చి ఈ ప్రకటన చేస్తున్నా. మీకున్న వ్యక్తిగత ఆలోచన మీద నాకు గౌరవం ఉంది. మీకు ఏది మంచి నిర్ణయం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్ కు ఎన్నికల్లో నష్టం జరుగుతుందనే ఇప్పటివరకు బహిరంగ ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పూర్తి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ ప్రకటలో తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios