హైదరాబాద్: పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే, మాదాపూర్‌లోని ఓ పబ్‌లో నిన్న రాత్రి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కొడుకు అశీష్‌గౌడ్‌, ఫుల్లుగా మద్యం తాగి యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. 

Also read: రాజకీయ కుట్ర, వాస్తవం లేదు: సంజన ఫిర్యాదుపై ఆశిష్ గౌడ్

అశీష్‌గౌడ్‌ అడ్డువచ్చిన వారిని కూడా చితకబాదాడు. ఆయన ప్రవర్తించిన తీరుపై మాదాపూర్‌ పీఎస్‌లో భాదితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై టీవీ నటి బిగ్ బాస్ ఫేమ్ సంజన సంజన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

క్రైమ్ నెంబర్ 948/2019 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. 354,354ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

బిగ్ బాస్ ఫేమ్ సంజన కంప్లయింట్ లో అశీష్‌గౌడ్‌, అతని స్నేహితులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని సంజన పేర్కొంది. తాను, తన స్నేహితురాళ్ళు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుండగా ఆశిష్ రెడ్డి, అతని స్నేహితులు చేతులు పట్టుకొని వెకిలి వేషాలు వేశారని ఆమె తెలిపింది. 

వారు అక్కడితో ఆగకుండా బూతులు మాట్లాడుతూ, సీసాలను నేలకేసి కొట్టారని తమ మీదకు దాడి చేయడానికి కూడా ప్రవర్తించారని సంజన పేర్కొంది. ఈ తతంగాన్నంతటిని చూస్తున్నటువంటి పక్కనే ఉన్న బౌన్సర్ తమకు సహాయం చేయకపోగా, ఆశిష్ గౌడ్, అతని స్నేహితులకు వంత పాడాడని ఆమె పేర్కొంది. 

జూలైలో ఆశిష్ గౌడ్ బీజేపీలో చేరాడు. ఆ సందర్భంగా భారీ బైక్ ర్యాలీని కూడా తీశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమక్షంలో ప్రత్యేకంగా నిర్మించిన వేదిక వద్ద ఆశిష్ గౌడ్ ర్యాలీగా చేరుకొని ఆ కార్యక్రమంలో బీజేపీలో అధికారికంగా చేరారు. అక్రమంగా ఆవులను తరలిస్తే తరలించే వాహనాలను కూడా తగులబెడతామని సంచలన వ్యాఖ్యలను కూడా గతంలో చేసారు. 

ఇక ఈ ఘటన పై స్పందించిన ఆశీష్ గౌడ్, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా చేస్తున్నారని అన్నాడు.