Asianet News TeluguAsianet News Telugu

రాజకీయ కుట్ర, వాస్తవం లేదు: సంజన ఫిర్యాదుపై ఆశిష్ గౌడ్

తనపై తప్పుడు కేసు బనాయించారని పటాన్ చెరువు మాజీ  ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు ఆశిష్ గౌడ్ ఆరోపించారు. 

Former MLA Nandeshwar Goud Son Ashish goud reacts on Sanjana complaint
Author
Hyderabad, First Published Dec 1, 2019, 11:21 AM IST

హైదరాబాద్ తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసు బనాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు ఆశిష్ గౌడ్ వివరణ ఇచ్చారు.

ఈ విషయమై ఆశిష్ గౌడ్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టారని ఆశిష్ గౌడ్ అభిప్రాయపడ్డారు.

తానేమిటో తన నియోజకవర్గానికి చెందిన ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.  తన రాజకీయ ఎదుగుదలను  
ఓర్వలేకనే ప్రత్యర్థులు తనపై కుట్రపన్ని తప్పుడు కేసు పెట్టించారని చెప్పారు.

ఏదైనా ఉంటే నేరుగా చూసుకోవాలని ఇలా మధ్యలో వేరే వాళ్లని ఉంచి రాజకీయం చేయడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.తనకు ఇవాళ ఉదయం నుండి ఈ విషయమై ఫోన్లు వస్తున్నట్టుా ఆయన చెప్పారు తాను  పబ్ లో దాడి చేసినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన చెప్పారు. 

తాను దాడి చేసినట్టుగా రుజువులు ఉంటే రుజువులతో మాట్లాడాలని ఆయన కోరారు. తనపై డైరెక్టుగా పోరాటం చేయాలని ఆయన హితవు పలికారు.బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను భయపడనని చెప్పారు. పబ్ లో గొడవ జరిగిందని తనకు తెలిసిందన్నారు. తన పేరున గొడవ చేసినట్టుగా తెలిసిందన్నారు. తాను కూడ పబ్ ఓనర్ ను కూడ కనుకొన్నట్టుగా చెప్పారు.

పబ్ లో గొడవ జరిగినట్టుగా కూడ తెలియదన్నారు. తనకు సంబంధం లేని విషయమై తనను ఇరికించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాను కూడ వెళ్తున్నట్టుగా ఆశిష్ గౌడ్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios