కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .. ముహూర్తం ఖరారు
ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో తుమ్మల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.

ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో తుమ్మల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వీరు కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా తుమ్మలను ఆహ్వానించారు. 17వ తేదీన జరిగే సభలో కాంగ్రెస్‌లో చేరాలని థాక్రే కోరగా.. దీనికి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పలు దఫాలుగా ఇప్పటికే తుమ్మలను కలిశారు కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్‌లో చేరే దానిపై నాగేశ్వరావు క్లారిటీ ఇవ్వలేదు.