సారాంశం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో నీ జన్మ ముగుస్తుందన్నారు. ప్రజల కోసమే తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చానని.. తన శాయశక్తుల పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ఆయన వెల్లడించారు. 

ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో నీ జన్మ ముగుస్తుందన్నారు. జాతీయ, రాష్ట్ర, స్థానికంగా వున్న కాంగ్రెస్ నేతలను తనను పార్టీలోకి ఆహ్వానించారని తుమ్మల తెలిపారు. తనకు చిన్న వయసులోనే ఎన్టీఆర్ .. నాయకుడిగా అవకాశం కల్పించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంత్రిగా వుండి పాలేరు నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. 

సోనియా, మన్మోహన్ సింగ్‌లు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని.. పేద ప్రజలకు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారని తుమ్మల పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి జలాలలో పాలేరును నింపుతానని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చానని.. తన శాయశక్తుల పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ఆయన వెల్లడించారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. 

ALso Read: ఓడి ఇంట్లో కూర్చుంటే, పిలిచి మంత్రిని చేశారు.. ఇప్పుడు కేసీఆర్‌కే ద్రోహం : తుమ్మలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

ఇకపోతే.. ఇక, బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్‌ అధిష్టానం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు తుమ్మలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తన అనుచరులు, సన్నిహితులతో చర్చించిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఈ క్రమంలోనే గత నెల 16న బీఆర్ఎస్‌కు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా  చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. బీఆర్ఎస్‌లో తనకు సహకరించిన వారికి తుమ్మల ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.