రేవంత్ రెడ్డికి.. కోమటిరెడ్డి  సెటైర్

కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి సెటైర్ వేశారు. తామంతా ముప్పై ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నామని, అయినా ఎలాంటి పదవి ఆశించలేదని 
గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి అంత తొందరేమిటని ఆయన ప్రశ్నించారు. ఇటీవల రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా.. దీనిపై కోమటిరెడ్డి పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు.

పదవుల కన్నా కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలలో ఎమ్మెల్యే అని పేర్కొన్నారని, కనుక తన సౌకర్యాలను పునరుద్దరించాలని ఆయన కోరారు.