Asianet News TeluguAsianet News Telugu

మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్... తెరాస కు ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి జూపల్లి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రాభవం ఏమి తగ్గలేదని నిరూపించుకున్నాడు. అక్కడ ఉన్న 20 కి 20 వార్డుల్లో తన వర్గం వారిని రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దింపారు. 

ex minister jupally krishna rao gives a shocker to TRS and Minister niranjan reddy
Author
Kollapur, First Published Jan 25, 2020, 11:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రాభవం ఏమి తగ్గలేదని నిరూపించుకున్నాడు. అక్కడ ఉన్న 20 కి 20 వార్డుల్లో తన వర్గం వారిని రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దింపారు. 

 

తన వర్గం వారందరిని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తుపై తన వర్గం వారిని పోటీచేయించాడు జూపల్లి. అలా దింపిన వారందరూ కూడా ప్రస్తుతానికి ముందంజలో కొనసాగుతున్నారు. కేవలం కొల్లాపూర్ లో మాత్రమే కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్,కొల్లాపూర్, ఐజ, ఆలంపూర్ లలో స్పష్టంగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల హవా కనబడుతుంది. 

 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఎన్నికలు తెరలేపాయని అధికార పార్టీలో టాక్ మొదలైంది. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజయం సాధించి గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తనకు బలాన్ని నిరూపించుకునేందుకు మున్సిపల్ ఎన్నికలే కీలకమని జుపల్లి ప్రణాళికలు అమలు చేస్తున్నారు.  

రాజకీయంగా సుధీర్హ అనుభవం ఉన్న నిరంజన్ రెడ్డి  తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో నిరంజన్ రెడ్డి వర్గం మాజీ మంత్రికి  ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని పావులు కదుపుతోంది.

రెబల్స్ గా పోటీ చేస్తున్న నేతలపై పార్టీపరంగా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో కొల్లాపూర్,అలంపూర్, కల్వకుర్తి, నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు జూపల్లి వర్గానికి మధ్య ప్రధాన పోటీ గా మారింది.

తన అనుచరుల విజయం కోసం తెరవెనుక చక్రం తిప్పుతున్న జూపల్లి మెజారిటీ నేతలను గెలిపించుకుంటీనే పార్టీలో పట్టు ఉంటుందని లేదంటే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే అదనుగా అధికార పార్టీ గా సీనియర్ మాజీ కి చెక్ పెట్టాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఆ మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికార పార్టీ అభ్యర్థుల విజయం కోసం పావులు కదుపుతున్నారు.దీంతో అభ్యర్థుల మధ్య పోటీ కంటే మాజీ మంత్రి  వర్సెస్ మంత్రి అన్న చందంగా ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు మారాయి

Follow Us:
Download App:
  • android
  • ios