Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి ఈటల.. ఈ నెల 14న ముహూర్తం, నడ్డా సమక్షంలో కాషాయ కండువా

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు.

ex minister eatala rajender to join bjp on 14th june ksp
Author
Hyderabad, First Published Jun 10, 2021, 7:22 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు.

కాగా, టీఆర్ఎస్‌తో 19 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ ఈటల రాజేందర్ ఈ నెల 4న గులాబీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన .. తాను నీకు బానిసను కాదు.. ఉద్యమ సహచరుడినని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంతకు చోటులేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం పెట్టింది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి మాదిరిగా ఏర్పాటు చేసిన పార్టీ ఇది కాదన్నారు. 

Also Read:నాశనం చేసుకొన్నాడు, ఆ దేవుడు కూడ గెలిపించలేడు: ఈటలపై గుత్తా సంచలనం

కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చుకో తమకు అభ్యంతరం లేదని తాము చెప్పామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కానీ తన కొడుకును సీఎం చేసే పేరుతో తమపై బరద చల్లే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు.కేటీఆర్ కింద పని చేస్తానని హరీష్ రావు ప్రకటించారన్నారు. కేటీఆర్  సీఎం పదవికి అర్హుడని కూడ తాను ఆనాడు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  నీ కోసం అండగా ఉన్నవాళ్లు పార్టీ నుండి బయటకు వెళ్తున్నారన్నారు.  ఉద్యమ సమయంలో  నిన్ను చంపినా కుక్కను చంపినా ఒక్కటే అని విమర్శించిన వారంతా నీ వెంటే  ఉన్నారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios