సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో రామచంద్రారెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం గుండెపోటు రావడంతో రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అంత్యక్రియలు తలమడుగు మండలంలోని స్వగ్రామం కోదడ్‌లో శుక్రవారం జరగనున్నాయి. 

రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్‌లో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

Scroll to load tweet…