హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుంచి తుపాకులు మాయమైన ఘటనపై మాజీ సీఐ భూమయ్య స్పందించారు. 2-3 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ నుంచి తాను బదిలీ అయిన  రెండు నెలల తర్వాత తుపాకులు మాయమయ్యాయన్నారు.

తుపాకులు మాయమైన ఘటనను తనపై, తన గన్ మెన్ పై నెట్టే ప్రయత్నం  చేశారని ఆయన గుర్తుచేశారు. తుపాకీ తూటా పోతేనే కఠినంగా వ్యవహరించే డిపార్ట్ మెంట్ రెండు తుపాకులు పోయినా ఎవరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని భూమయ్య నిలదీశారు.

Also Read:కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ: బీజేపీలోకి కొత్తకోట దంపతులు?

ఆ తుపాకీని ఆటో మోడ్‌లో పెట్టి ఫైర్ చేస్తే ఎంతో విధ్వంసం జరిగేదని... నక్సల్స్, టెర్రరిస్టుల చేతికి పోతే ఏం జరిగేదో ఊహించడం కూడా కష్టమేనన్నారు. తుపాకులు తీసుకుపోయావంటూ నన్ను అప్పటి ఏసీపీ రమణ కుమార్ మానసిక క్షోభకు గురి చేశారని భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

రిటైర్డ్ అయి ఎక్స్ టెన్షన్ పొందిన అధికారుల్లో అగ్రవర్ణాల వారే ఎక్కువని.. రిటైర్డ్ అయిన పోలీసు అధికారులను  కొనసాగించే పద్ధతి మారాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి ఎస్సై నిర్లక్ష్యమే తుపాకుల చోరీకి కారణమని భూమయ్య ఆరోపించారు.

Also Read:కారణమిదే:కేసీఆర్‌తో అక్బరుద్దీన్ భేటీ

సదానందం కాల్పులు జరపకపోయి ఉంటే ఆ నింద ఇంకా తనపైనే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటి సిద్ధిపేట  సీపీ శివకుమార్ తో ఉన్న విభేదాలతోనే తనపై కక్ష సాధింపుకు పాల్పడ్డారని భూమయ్య తెలిపారు.

తుపాకులు మాయమైతే వెంటనే కేసు పెట్టాలని.. కానీ ఎస్పీ జోయల్ సీపీగా వచ్చేంత వరకు ఎవరూ కేసు పెట్టలేదని ఆయన గుర్తుచేశారు.  నేను తప్పు చేయలేదని ఇప్పటికైనా బయటకు తెలిసిందని భూమయ్య పేర్కొన్నారు.