Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ అగ్రనేతలతో ఈటల వరుస భేటీలు: నేడు హైద్రాబాద్‌కు తిరిగి రాక

మాజీ మంత్రి  ఈటల రాజేందర్ బుధవారం నాడు న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రానున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చిస్తున్నారు. 

Etela Rajender to return hyderabad from Delhi today lns
Author
Karimnagar, First Published Jun 2, 2021, 12:22 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి  ఈటల రాజేందర్ బుధవారం నాడు న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రానున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చిస్తున్నారు. గత నెల 31వ తేదీన ఈటల రాజేందర్  హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి వెళ్లారు. అదే రోజు సాయంత్రం ఆయన  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈటల రాజేందర్ తో పాటు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులున్నారు. 

also read:వైఎస్, రోశయ్య, కిరణ్‌లను కలిశారు.. అప్పుడు ఆత్మాభిమానం ఏమైంది: ఈటలపై పల్లా విమర్శలు

హైద్రాబాద్ నుండి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నాడు న్యూఢిల్లీకి చేరుకొన్నారు.  మంగళవారం నాడు రాత్రి ఈటల రాజేందర్  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీలో చేరికతో పాటు పార్టీలో తన భవిష్యత్తు విషయమై  ఈటల రాజేందర్  కిషన్ రెడ్డి చర్చించారు.  ఏ రోజున బీజేపీలో చేరే విషయమై చర్చించారు.  జేపీ నడ్డా  సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు  ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని  మరో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనకు ఈ విషయమై పార్టీ నేతలు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. ఈ విషయమై పార్టీలో చర్చిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈటల బీజేపీలో చేరికకు  రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడ సానుకూలంగా ఉంది.  టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను  కూడ తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈటల రాజేందర్ ఏ రోజున బీజేపీలో చేరే విషయమై ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై  కమలదళం నేతలతో రాజేందర్ చర్చించారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు చర్చించినట్టుగా సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios