Asianet News TeluguAsianet News Telugu

ఎట్టి స్థితిలోనూ కేసీఆర్ కలువను, ప్లాన్ ప్రకారమే జరుగుతోంది: ఈటెల రాజేందర్

వైద్య ఆరోగ్య శాఖ నుంచి తనను తొలగించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. శాఖ తొలగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని రాజేందర్ వెల్లడించారు. 

etela rajender reaction on portfolio transfer ksp
Author
Hyderabad, First Published May 1, 2021, 3:01 PM IST

వైద్య ఆరోగ్య శాఖ నుంచి తనను తొలగించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. శాఖ తొలగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని రాజేందర్ వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వైద్య ఆరోగ్య శాఖను సీఎం తీసుకున్నారని ఈటల చెప్పారు. తనకు ఏ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రణాళిక ప్రకారం తనపై కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.

రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని రాజేందర్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నం చేయనని ఆయన స్పష్టం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు వుందని రాజేందర్ వెల్లడించారు. 

తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటెల రాజేదర్ అన్నారు. కేసీఆర్ చర్యలను అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తారని ఆయన అన్నారు. వంద ఎకరాల్లో షెడ్లు నిర్మించానని చెబుతున్నారని, నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.  సీఎంతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. 

అంతకుముందు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈటల నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ వుండనున్నారు. 

కాగా, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ఈటల భూకబ్జాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వారు ప్రభుత్వం 1994లో తమకు సర్వ్ నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికీ 1 ఎకరం 20 కుంటల చొప్పున, అలాగే సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు తెలిపారు.

Also Read:ఈటెల రాజేందర్ కు షాక్: కేసీఆర్ చేతికి వైద్య, ఆరోగ్య శాఖ, గవర్నర్ నిర్ణయం

కొన్ని రోజులుగా ఈ భూముల కోసం ఈటల రాజేందర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ అసైన్డ్ భూములను త్వరలో ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుంటుందని రాజేందర్ బెదిరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే అక్కడ దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని.. అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నరంటూ  తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనిని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈటల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.. శనివారం విచారణ ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios