Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పుట్టినోడు ప్రశ్నకు… ప్రశ్నించడానికి భయపడడు: ఈటెల‌

తెలంగాణ ప్రభుత్వం మీడియా గొంతును నొక్కేస్తుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఏ 
రాజ్య‌మైతే.. ప్ర‌జ‌ల హక్కులు, పత్రికలపై దాడి చేస్తుందో .. దాని ప‌తానాన్ని అదే కోరి తెచ్చుకుంటుందని అన్నారు. ప్రభుత్వం చేసే.. పిచ్చి పనులను సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పార్టీలు.. సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు.. పత్రిక స్వేచ్ఛ ప్రజల స్వేచ్ఛకు సంబంధించినది.సావుకైనా తెగిస్తం.. హక్కులను కాపాడుకుంటం. ఆకలైనా తట్టుకుంటరు.. ఆత్మ గౌరవాన్ని వదులుకోరు తెలంగాణ ప్రజలు..ఐక్యంగా ఉందాం.. చట్ట పరిధిలో పోరాడుదాం.. నా వంతు మద్దతు ఉంటుందని రాజేంద్ర హమీ ఇచ్చారు.
 

etela rajender fire on cm kcr
Author
Hyderabad, First Published Jan 9, 2022, 7:08 AM IST | Last Updated Jan 9, 2022, 7:08 AM IST

Etela Rajender:  రాజ్యం ఎప్పుడైతే హక్కులు, పత్రికలపై దాడి చేస్తుందో పతనం అంచున ఉన్నట్టు అర్థమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. . సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. మొత్తం మీడియాను ముఖ్యమంత్రి గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. యూట్యూబ్ చానెళ్ల ద్వారా అయిన ధైర్యంగా నిజాలు బయటకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం మీడియా గొంతును నొక్కేస్తుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 
రాజ్య‌మైతే.. ప్ర‌జ‌ల హక్కులు, పత్రికలపై దాడి చేస్తుందో .. దాని ప‌తానాన్ని అదే కోరి తెచ్చుకుంటుంది.
 శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మీడియాపై కేసీఆర్ వైఖరిని ఖండించారు. 

తెలంగాణలో మీడియాకు స్వేచ్ఛ ఉందా..? ఉమ్మడి  పాలనలో స్వేచ్ఛ ఉందా..?’’ అని ప్రశ్నించారు. 
తెలంగాణలో పుట్టినోడు ఎవడూ.. ప్రశ్నకు… ప్రశ్నించడానికి భయపడడని అన్నారు. ఉద్యమం.. చైతన్యం ద్వారా వచ్చిన‌వాడు నాయ‌కుడ‌వుతాడ‌నీ,  వాటిని ఎట్లా పాతరేస్తుండో తెలుస్తోంది. రాజ్యం హక్కులు.. మీడియా పై దాడి చేస్తుందో  అదే వారిని పతనం అంచుకు చేర్చుతుందని చేప్పారు. హుజూరాబాద్ లో సొంత ఓటు హక్కు ను కూడా డబ్బుతో కొన్నారనీ, ఓటర్లను ఎన్ని రకాలుగా బెదిరించవచ్చో అన్ని రకాలుగా బెదిరించారని గుర్తు చేశారు. ధర్మం.. ప్రజలు.. ఆత్మ గౌరవం గెలిచి.. కేసీఆర్ అహంకారం ఓడిపోయిందన్నారు. మీడియాను కొనుక్కునే ప్రయత్నం చేయడం.. లేదంటే బెదిరించడం సీఎం కేసీఆర్ కి అలవాటుగా మారిపోయింది. 

ప్రభుత్వ పిచ్చి పనులను సహించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరనీ, పార్టీలు.. సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు. కానీ, పత్రిక స్వేచ్ఛ అనేది ప్రజల స్వేచ్ఛ అని అన్నారు. సావుకైనా తెగిస్తం.. హక్కులను కాపాడుకుంటాం. ఆకలైనా తట్టుకుంటరు.. ఆత్మ గౌరవాన్ని వదులుకోరు తెలంగాణ ప్రజలు. ఐక్యంగా ఉందాం.. చట్ట పరిధిలో పోరాడుదాం.. నా వంతు మద్దతు ఉంటుందని రాజేంద్ర హమీ ఇచ్చారు.

రాష్ట్రంలో కొందరు జర్నలిస్టులను అకారణంగా అరెస్ట్ చేస్తున్నార‌నీ, వారిపై దాడులు చేస్తున్నార‌ని  ఈటల అన్నారు. వారిని ఆ తీసుకెళ్తుంది పోలీసులా? లేక ముఖ్యమంత్రి మనుషులా అర్థం కావడం లేదని అన్నారు. ఈ విష‌యంపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చట్ట ప్రకారం చర్యలు చేసేవారైనా తప్పు చేస్తే  తీసుకోవాలని, కానీ ఇలా దొంగల్లా వ్యవహరించడం సరికాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చిల్లర పనులు చేసిందని ఈటల అన్నారు. ఒక్క ఓటుకు రూ.26 వేలు అంటే మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. కొన్ని వార్తా పత్రికల ద్వారా తనపై ఇప్పటికీ విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు ఈటెల రాజేంద‌ర్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios