హైదరాబాద్: తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ప్రోత్సాహక బోర్డు ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర మంత్రి పురుషోత్తం తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయమై ప్రత్యేక పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

పసుపుతో పాటు సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.  పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ఆయన ప్రశ్నించారు.కేవలం పేరే కావాలా.. ఉద్దేశం నెరవేరేలా ఫలితం కావాలా అని కేంద్ర మంత్రి అడిగారు. 

ప్రాంతీయ బోర్డులతో తెలంగాణరైతులు ప్రయోజనం పొందుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు పసుపు పండిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు  విషయమై  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతులు  పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసి తమ డిమాండ్ ను దేశ వ్యాప్తంగా అందరికి తెలిసేలా చేశారు.