హైదరాబాద్: ఈఎస్ఐ స్కాం కేసులో దేవికారాణిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయనుంది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి  దేవికారాణి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఈడీ దేవికారాణిపై కేసు నమోదు చేసింది.

Also read:ఈఎస్ఐ స్కాం: దేవికా రాణి దోపిడికి సాయం చేసింది వీరిద్దరే

ఈఎస్ఐ స్కాం లో దేవికారాణిపై ఇప్పటికే మూడు కేసులను నమోదు చేసింది ఏసీబీ.  దేవికారాణి కేసులో ఏసీబీ అధికారులు తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూశాయి. షెల్ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులను కొల్లగొట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

దేవికారాణి ఎలా ఈ కంపెనీలను ఏర్పాటు చేసింది, ఈ కంపెనీల నుండి డబ్బులను ఎలా స్వాధీనం చేసుకొందనే విషయమై కూడ ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దేవికారాణిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.ఈ మేరకు ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.